సిరాన్యూస్,జైనథ్
రైతు అల్లకొండ చిన్న భూమన్న ఆత్మహత్య
ఆస్తమా వ్యాధి భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్ గ్రామానికి చెందిన రైతు అల్లకొండ చిన్న భూమన్న (64) గత కొంత కాలంగా ఆస్తమా వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. చాలాసార్లు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం తీసుకున్నాడు. అయిన వ్యాధి నయం కాలేదు. శనివారం రాత్రి శ్వాస తీసుకోవడం చాలా కష్టం గా మారడంతో విసిగి పోయిన అతను పురుగుల మందు తాగాడు. ఈ విషయం గ్రహించిన అతని కొడుకు రిమ్స్ లో చేర్పించాడు. భూమన్న చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.