సిరా న్యూస్,హైదరాబాద్;
ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్ వేగం పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కమిషన్‌పై సమీక్షలు నిర్వహించారు. బోర్డు ప్రక్షాళనలో భాగంగానే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరో ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామాలు పంపారు.రాజీనామాలకు ఇంకా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలపలేదు. వారు రాజీనామా చేసి రెండు వారాలు గడుస్తున్న గవర్నర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు కనిపిస్తుంది. రాజీనామాల ఆమోదంలో న్యాయనిపుణుల సలహా గవర్నర్ కోరినట్లు సమాచారం. రాజీనామాల అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది.రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతో నోటిఫికేషన్ల విషయంలో అడుగు ముందుకు వేయలేకపోతున్నట్లు ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాజీనామాల ఆమోదం కోసం ఇప్పటికే మూడు నాలుగు సార్లు గవర్నర్‌ని ప్రభుత్వం సంప్రదించింది. గవర్నర్ నిర్ణయం తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.మరోవైపు తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చే సూచనలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. తమిళిసై స్థానంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్‌ను నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఆ గవర్నర్ విషయం తెలాల్సి ఉండటంతో ప్రభుత్వం కొంత సందిగ్ధంలో పడింది. ప్రక్షాళన సమయంలో గవర్నర్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. గ్రూప్ 2 పరీక్షలు జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉంది. దీంతో అటు గ్రూప్ 2 అభ్యర్థుల్లో, ప్రభుత్వానికి ఆందోళన మొదలైంది.ఈ గ్రూప్ 2 ఉద్యోగానికి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇంకా గవర్నర్ విషయం తేల్చకపోవడంతో నూతన బోర్డు అనేది కుదరదు. దీంతో ప్రస్తుత టీఎస్‌పీస్‌సీ కొనసాగింపుతోనే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ తాత్కాలిక అధికారితో గ్రూప్ 2 పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది