కళ్యాణ మండపం తలుపులు పగల కొట్టుకొని లోనికి చోచ్చుకు వచ్చిన ప్రజలు
తొక్కిసలాట…. నలుగురికి తీవ్ర గాయాలు
అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సిరా న్యూస్,మైలవరం;
వరద బాధితులకు సరుకులు పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వరద బాధితులకు సరుకులు పంపిణీ కార్యక్రమంలో తొక్కి ఇస్లాట తోడు చేసుకోవడంతో నలుగురికి గాయలను ఘటన కొండపల్లిలో చోటుచేసుకుంది
కొండపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు సరుకులు ఇవ్వడం ఆదివారం మధ్యాహ్నం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మంత్రులు అధికారులు వెళ్లిన అనంతరం సరుకులు పంపిణీల్లో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో పంపిణీదారులు కళ్యాణ్ మండపం లోపల ఉండి ప్రజలను బయటపెట్టి తలుపులు వేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు తలుపులు నెట్టుకొని లోపలికి తెచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా తలుపులలో నలుగురు వ్యక్తుల చేతులు పడి గాయలను పరిస్థితి చోటుచేసుకుంది దీంతో ప్రజలు స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇక్కడ ఎలాంటి అధికారులు కూడా లేకుండా పంపిణీ చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.