సిరా న్యూస్,మెదక్;
ఏడుపాయల ఆలయం నాలుగు రోజులుగా జలదిగ్బంధంలోనే వుంది. దేవి మంజీరా నది వరద ఉధృతి శరన్నవరాత్రి ఉత్సవాలకు అడ్డంకిగా మారింది. శనివారం ఉదయానికి ఆలయం ఎదుట వరద కాస్త తగ్గింది. గర్భగుడి మూసేసి రాజగోపురంలో ఆర్చకులు అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అన్నపూర్ణదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.