కాపాడిన కానిస్టేబుల్
సిరా న్యూస్,కరీంనగర్;
సిరిసిల్ల సమీపంలోని మానేర్ వాగులో దూకి అంబెడ్కర్ నగర్ కు చెందిన మహిళాలక్ష్మీ ఆత్మహత్యాయత్నం చేసింది. మహిళను కానిస్టేబుల్ దేవరాజు కాపాడాడు. మనసు బాగాలేక కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు యత్నించినట్లు మహిళ తెలిపింది. మహిళను కాపాడిన కానిస్టేబుల్ దేవరాజును ఎస్పీ అఖిల్ మహజన్ అభినందించారు.చిన.