సిరా న్యూస్,రంగారెడ్డి;
హైదర్ షాకోట్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త. నిద్రిస్తున్న భార్యను భర్త శ్రీనివాస్ సుత్తి తో కొట్టి చంపాడు. కుటుంబ కలహాల తో భార్య ను హత మార్చినట్లు సమాచారం. గత కొంత కాలంగా భర్త తనను టార్చర్ చేస్తున్నట్లు పలు మార్లు పోలీస్ స్టేషన్లలో మృతురాలు ఫిర్యాదు చేసింది. భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన హంతకుడు, భార్యను హత్య చేసానని చెప్పాడు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.