బిజెపి ఏపీ ప్రెసిడెంట్ పురందేశ్వరి
సిరా న్యూస్, అమలాపురం;
రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయం బిజెపి అధిష్టానం నిర్ణయిస్తుందని బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వర అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి విధ్వంస్కర విద్వేషపూరిత ప్రభుత్వం పాలన చేస్తుందని ఆమె దుయ్యబట్టారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా బిజెపి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అమలాపురం పట్టణంలో పురందేశ్వరికి బిజెపి కార్యకర్తలు జన స్వాగతం పలికి ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్లో స్టిక్కర్ ప్రభుత్వం పాలన చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల నిధులు జిల్లాల అభివృద్ధికి ఖర్చు చేస్తుందని ఆమె లెక్కలతో సైతం గా వివరించారు. జగన్ ప్రభుత్వం చివరికి దేవుడిని కూడా వదలడం లేదని జగన్మోహన్లు ఉండవలసిన చోట జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటుందా అని తిరుమల రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ పై ఆమె మాట్లాడారు