గెలుపు కోసం కష్టపడ్డ వారిని గుర్తించాలి…
ఏఎంసీ ప్రకటనలో జాప్యం ఎందుకు…
సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వ్యవసాయంపై అవగాహన ఉన్నవారికి ఇవ్వాలని పలువురు కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి శ్రీధర్ బాబు గెలుపులో ప్రముఖ పాత్ర వహించిన వారికే ఈ పదవి అప్పగించాలని గుసగుసలు విన వస్తున్నాయి. అలాగే సుమారు పెద్దపల్లి జిల్లాలో రెండు మార్కెట్ కమిటీ లు మంథని మరియు కమాన్ పూర్ మాత్రమే ప్రకటించాల్సి ఉంది. కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం చాలామంది ఆశావాహులు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో రామగిరి ముత్తారం కమాన్ పూర్ మండలాల నుండి నాయకులు తమకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ చైర్మన్ పదవి కోసం మండల కేంద్రానికి చెందిన బీసీ నాయకుడు పెద్ద ఎత్తున పావులు కదిలిస్తున్నాడు. అలాగే ఈసారి స్థానికులకు ఇవ్వాలని బలంగా వినబస్తోంది. అలాగే పట్టణాలకే పరిమితమై వ్యాపారాల్లో నిమగ్నమయ్యే వ్యక్తులకు కాకుండా స్థానికంగా ఉండే నాయకులకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు. కాంగ్రెస్ నాయకులతోపాటు సీనియర్ పాత్రికేయునికి సైతం మంత్రి ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈసారి కమాన్ పూర్ స్థానికులకే ఇవ్వాలనే వాదన బలంగా వినవస్తోంది. మండల కేంద్రానికి చెందిన బిసి నాయకునికి ఇవ్వడం సభబేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మనసులో ఎవరు ఉన్నారో త్వరలోనే తేలనుంది