సిరా న్యూస్,అమలాపురం;
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగాయి. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో స్వామి క్షమించు.. దోషులను శిక్షించు పేరుతో జనసేన పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రెండు రోజులుగా జనసేన పార్టీ రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. తిరుపతి లడ్డు కల్తీ కి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలపి నిరాహార దీక్షలు చేపటక్టారు. జనసేన పార్టీ పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దీక్షకు మద్దతు పలికారు. దీక్షలో కూర్చున్న వాళ్ళకి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా అన్నిచోట్ల జనసేన నేతలు ఆందోళనలు చేస్తున్నారు.