సిరా న్యూస్,తిరుపతి;
ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసారు. నిందితులు పసుపులేటి సాయి (28), వినోద్ కుమార్ (30)గా గుర్తించారు. రూ. 6.90 లక్షలు విలువ చేసే 1,266 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇదివరకు పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్నారు. ముద్దాయిలుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్సీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.