సిరా న్యూస్,తిరుపతి;
శ్రీ పద్మావతి అమ్మవారిని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద చేరుకున్న మంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి ఆ ముక్కలు తీర్చుకున్న అనంతరం మూల మూర్తిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో అర్చకులు వేదమంత్రోచ్ఛారణ ఆశీర్వాదం చేయగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ కే పి చంద్రశేఖర్, సీనియర్ అర్చకులు బాబు స్వామి,తదితరులు పాల్గొన్నారు.