సిరాన్యూస్, కుందుర్పి
వడ్డెపాళ్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు సూచనల మేరకు సోమవారం కుందుర్పి మండలంలోని వడ్డెపాళ్యం, శ్రీమజ్జనపల్లి గ్రామాల్లో టీడీపీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ విశిష్టతను ప్రజలకు వివరించారు. సభ్యత్వ నమోదు ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమంలో స్థానిక ప్రజలు చురుగ్గా స్పందించారు. కార్యక్రమంలో వడ్డెపాళ్యం, శ్రీమజ్జనపల్లి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు