సిరా న్యూస్,పాలకొల్లు;
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 13326 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ఆమోదించిన పనులను 100 రోజుల పాలనలోనే ప్రారంభించడం చారిత్రాత్మకమని నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం గోరింటాడ, సగం చెరువు గ్రామాల్లో దాదాపు రెండు కోట్ల రూపాయలతో చేపట్టనున్న మంచినీటి, రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభల ద్వారా 4500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 30 వేల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మూడు వేల కిలోమీటర్లు సీసీ రహదారి నిర్మాణంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి పనులు చేపడుతున్నామని అన్నారు. గత వైసిపి పాలనలో రూ. 14 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజల నెత్తిన పెట్టడమే కాక గ్రామపంచాయతీలకు కేంద్ర విడుదల చేసిన నిధులను సైతం డైవర్ట్ చేయడంతో సర్పంచులు బిక్షమెత్తుకునే దుస్థితికి వెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనా దక్షత గల చంద్రబాబు పవన్ కళ్యాణ్ అండతో ప్రధాని మోదీ ఆశీస్సులతో 100 రోజుల్లోనే అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. అతి చిన్న గ్రామాలైన గోరింటాడ, సగం చెరువు గ్రామాలకు రెండు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం పట్ల ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఘన స్వాగతం పలికి సత్కరించారు