యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యం
హోం గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమే
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ శుక్రవారం కమిషనరేట్ లో హోం గార్డ్స్ లో భేటీ అయ్యారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. హోంగార్డ్ సిబ్బందికి యూనిఫామ్ అలవెన్స్ త్వరలో అందజేస్తామని తెలిపారు. మరియు రైన్ కోట్స్ హెల్త్ కార్డు, గురించి పై అధికారులకు ప్రపోజల్స్ పంపించడం జరిగింది త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుందన్నారు. యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని యూనిఫాంలో ఉన్న వారిని పదిమంది గమనిస్తూ ఉంటారని అది తెలుసుకొని విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి దర్బార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. హోంగార్డు సిబ్బందికి విధి నిర్వహణలో కానీ వ్యక్తిగతంగా కానీ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తెలపాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ముందుంటామన్నారు, యూనిఫాం సర్వీస్ డెలివరీలో అందరూ సమానమని అందరము ఒకే కుటుంబ సభ్యులకు సంబంధించిన వారిమని తెలిపారు, క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు, ప్రతి శనివారం పెరేడ్ నిర్వహించినప్పుడు మీ సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు వెంటనే తెలపాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. పోలీసు శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని, ప్రతి పోలీస్ స్టేషన్ లో పోలీసు సిబ్బందితో బాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహించారని, ఇక ముందు కూడా ఇదే అదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు.
క్రమశిక్షణతో విధులు నిర్వహించే వారిని గుర్తించి రివార్డులు అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖలో పని చేస్తున్నప్పుడు సర్వీస్ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించరాదని, డ్యూటీలో ఉన్న ఆఫ్ డ్యూటీలో ఉన్న పోలీస్ శాఖ ప్రతిష్టను భంగపరిచే విధంగా ప్రవర్తించరాదని, అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. పోలీస్ శాఖ లో పనిచేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. మీమీ సమస్యలు ఏమైనా ఉంటే వారి అధికారులకు, ఏఆర్ అడిషనల్ డీసీపీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్, ఆర్ఎస్ఐ, లేదా సిపి కార్యాలయానికి వచ్చి నేరుగా తెలపాలని సూచించారు.
ఈ దర్బార్ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, ధరణి కుమార్, ఆర్ఎస్ఐ బాలకృష్ణ, హోంగార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, జిల్లాలో ఉన్న హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.