బొత్స సత్యనారాయణ
సిరా న్యూస్,విశాఖపట్నం;
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కూటమి విధానం సీఎం చంద్రబాబు చెప్పాలని ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ నిలదీసారు. కేంద్ర మంత్రులు చెప్తున్నది వేరు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరు. స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై చంద్రబాబు వైఖరి ఏమిటి..? కేంద్ర ప్రభుత్వ విధానాలను బాబు సమర్థిస్తున్నారా..? ఈ ప్రాంత మనోభావాలను గౌరవించాలి. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయం చెయ్యద్దని అన్నారు. ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. చంద్రబాబు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ పై ద్వంద్వ వైఖరితో వెళ్తే ప్రజలు ఉపేక్షించరని అన్నారు.