సిరా న్యూస్,విజయవాడ;
కాంట్రాక్టు పనులు, ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బు తీసుకుని తిరిగివ్వకపోగా శారీరకంగా వాడుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మేరుగు నాగార్జునపై విజయవాడకు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో మేరుగు నాగార్జునపై పోలీసులు అత్యాచారం, మోసం కేసులు నమోదు చేసారు. మాజీ మంత్రికి సహకరించి, బాధితురాలిని బెదిరించిన ఆయన పీఏపై బెదిరింపుల కేసు నమోదు చేసారు.