సిరా న్యూస్,హైదరాబాద్;
కేటీఆర్ టార్గెట్‌గా ప్రభుత్వం పావులు కదుపుతుందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే పండుగకు ముందే దీపావళి బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి కామెంట్స్ చేశారని అంటున్నారు. అయితే ఫార్ములా ఈ రేసు నిధుల రిలీజ్‌పై కేటీఆర్ స్పందించిన తీరు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. బయట జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చేందుకే కేటీఆర్ మాట్లాడారా..లేక అలర్ట్ అయ్యారా అన్నదానిపై డిస్కషన్ జరుగుతోంది. అధికార పార్టీని డైలమాలో పడేసే వ్యూహంలో భాగంగానే ప్రెస్‌మీట్ పెట్టినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయమేంటో చెప్పారా..లేక అరెస్ట్‌పై కంగారు పడి మీడియా ముందుకు వచ్చారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తప్పేం చేయలేదన్నట్లుగా చెప్తూనే..అరెస్ట్‌కు భయపడనంటూ కామెంట్స్ చేయడం మరింత చర్చనీయాంశం అవుతోంది. జైలుకు వెళ్లడానికి కూడా రెడీగా ఉన్నానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేటీఆర్ మాటల వెనక తప్పు చేయలేదనే ధీమా ఉందా లేక అరెస్ట్‌కు మానసికంగా సిద్ధమయ్యారా అన్నది ఆసక్తికరంగా మారింది.ఫార్ములా ఈ రేస్ నిధుల విషయంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ డైరెక్టుగా ప్రెస్‌మీట్ పెట్టడంతో అసలు విషయమేంటన్న దానిపై చర్చ మొదలైంది. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహించారు. ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు.దీంతో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడంతో 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు హెచ్ఎండియే రూ.55 కోట్లు FEOకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఆర్థికశాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా ఇస్తారంటూ అధికార కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇదే విషయంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై కేటీఆరే మీడియా ముందుకు వచ్చి అసలు విషయం ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు.ఫార్ములా ఈ రేస్ కోసం స్పాన్సర్లు దొరకలేదంటే..ప్రమోటర్లు దొరికే వరకు తాత్కాలికంగా ప్రభుత్వం తరఫున పెట్టుబడి పెట్టామంటున్నారు కేటీఆర్. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడానికి ఫార్ములా ఈ రేసు కోసం అర్జెంట్‌గా రూ.55 కోట్లు కట్టాలంటే కట్టామని చెప్పుకొచ్చారు. ఇదంతా హెచ్ఎండియేకు తెలియకుండా జరిగిందనడం సరికాదంటున్న కేటీఆర్..నవంబర్ 14న హెచ్ఎండియే జీవో కూడా ఇచ్చినట్లు తెలిపారు.హెచ్ఎండియే ఇండిపెండెంట్ బోర్డు అని..హెచ్ఎండియే నిర్ణయాలు తీసుకోవాలంటే క్యాబినెట్ ఆమోదం అవసరం లేదంటున్నారు కేటీఆర్. హెచ్ఎండియేకు ఛైర్మన్‌గా సీఎం, వైస్ ఛైర్మన్‌గా మున్సిపల్ మినిస్టర్, ఎండీగా మెట్రోపాలిటన్ కమిషనర్ ఉంటారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కావొద్దని ఫార్ములా ఈ రేస్‌కు ఫండ్స్ రిలీజ్ చేయిమని తానే చెప్పానని క్లారిటీ ఇచ్చేలా మాట్లాడారు కేటీఆర్.
యోగా చేసుకుంటా అంటూ కామెంట్
తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై రేవంత్‌రెడ్డి సర్కార్ విచారణ జరిపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల కేసుల విచారణ తుది దశకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ విచారణ జరుగుతోంది. హైదరబాద్‌లో నిర్వహించిన ఫార్ములా రేసు విషయంలో ఓ విదేశీ సంస్థకు రూ.55 కోట్లు కేటాయించినట్లు ధ్రువీకరించారు. ఇందుకు మాజీ ఆర్థిక కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను విచారణ చేశారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకే నిధులు కేటాయించినట్లు తెలిపారు. దీంతో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ విషయంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. అక్రమంగా నిధుల కేటాయింపుపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు గవర్నర్‌కు లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ తొలిసారి స్పందించారు. బీఆర్‌ఎస్ భవన్‌లో మీడియాతో మాటా‍్లారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఫార్ములా ఈరేస్ తెచ్చి ఘనంగా నిర్వహించామన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి షేమ్ తెచ్చాడని సెటైర్లు వేశారు. ఇలాంటి సీఎం ఒలింపిక్స్ నిర్వహించడం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఒలింపిక్స్‌కు ఎంత ఖర‍్చవుతుందో తెలుసా అని ఎద్దేవా చేశారు.హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ నిర్వహించాలన్నది రెండు దశాబ్దాల కల అని తెలిపారు. 2003లో సీఎం రేవంత్‌రెడ్డి గురువు, అప్పటి ఉమ్మడి ఆంధ్రపదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఎఫ్1 రేసు నిర్వహించాలని ప్రయత్నించారని గుర్తు చేశారు. గురువు కలను విష్యుడు నెరవేర్చలేదు కానీ, తాము నెరవేర్చామని తెలిపారు. ఇక దేశంలో యూపీఎ ప్రభుత్వం కామన్‌వెల్త్ గేమ్స్ కోసం రూ.70,600 కోట్లు ఖర్చు పెట్టిందని గుర్తు చేశారు. ఇందులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తమిళనాడులో క ఊడా జరిగిన ఫార్ములా 4 అనే రేసు కోసం రూ.42 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఫార్ములా 1 ఈ రేసును రేసుగా మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేయాలనుకున్నామని తెలిపారు. ఇక ఈ రేసు కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.40 కోట్లు మాత్రమే అన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రయోజనం రూ700 కోట్లు అని చెపాపరు. ఫార్ములా ఈ రేస్, మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా రూ.2,500 కోట‍్ల పెట్టుబడులు తెచ్చామని వివరించారు.ఇక ఈ రేస్ పోటీలకు స్పాన్సర్లు దొరకకపోవడంతో ప్రమోటర్ దొరికే వరకు తానే భరోసాగా ఉంటనని చెప్పానన్నారు. ఇందుకు ప్రభుత్వ తరఫున డబ్బు ఇద్దామని చెప్పినట్లు అంగీకరించారు. హెచ్‌ఎండీఏకు తెలియకుండా డబ్బులు ఇచ్చామని చేస్తున్నా ఆరోపణలను ఖండిచారు. డబ్బుల కేటాయింపు హెచ్‌ఎండీఏకు తెలుసన్నారు. ఈ రేస్‌ను ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు రూ.55 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇందులో అరవింద్‌కుమార్ తప్పు లేదనితెలిపారు. తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పురపాలక శాఖలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పురపాలక శాఖలో ఇంటర్నల్‌గా డబ్బు అడ్జెస్ట్ చేసుకోవచ్చని తెలిపారు. దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదన్నారు. హెచ్‌ఎండీఏ స్వతంత్ర బోర్డు అని తెలిపారు.ఈ కేసులో తనను జైలుకు పంపితే యోగా చేసుకుంటానని తెలిపారు. కేసు పెడితే పెట్టండి.. అరెస్టు చేస్తే చేసుకోండి నాకేం ఫికర్ పడదు. ఓరెండు, మూడునెలలు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతానంటే నాకేం అభ్యంతరం లేదు. జైల్లో యోగా చేసుకుంటా.. బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తా అని కేటీఆర్ తెలిపారు. ఏసీబీ నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదని తెలిపారు. ముఖ్యమైన మంత్రిగా అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్‌కు ఇప్పడు అరెస్టు భయం పటుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.55 కోట్లు ఎవరికి ఇచ్చారన్నది మాత్రం ప్రెస్‌మీట్‌లో చెప్పలేదు. హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు వినియోగించామని చెప్పారు. మరి బ్రాండ్ ఎక్కడ పెరిగిందో కేటీఆర్‌కే తెలియాలి.