ఇతర పార్టీల సంగతేంటీ,,,,
సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా ట్రోలింగ్ మూకలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వైసీపీ తరపున సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చెలరేగిపోతున్న వారిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మిగిలిన పార్టీల ముసుగు మూకల మాటేమిటనే చర్చ కూడా జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేనంత నీచ రాజకీయాలకు ఏపీ చాలా కాలం క్రితమే వేదికగా మారింది.ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో సోషల్ మీడియా బాధితురాలంటే మొదట ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిల పేరునే చెప్పుకోవాలి. ఫేస్‌బుక్ అప్పుడప్పుడే విస్తరిస్తున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ సొంత కుంపటి పెట్టుకోవడం ఆ తర్వాత అరెస్టై జైలుకెళ్లిన తర్వాత అన్న కోసం పాదయాత్ర మొదలు పెట్టినపుడు రాజకీయ ప్రత్యర్థులకు ఆమె సాఫ్ట్ టార్గెట్ అయ్యింది. పుష్కర కాలం క్రితమే షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో దుష్ప్రచారం జరిగేది. ఇదంతా అప్పట్లో రాజకీయ పార్టీలకు వినోదంగా ఉండేది.2014నాటికి దేశ రాజకీయాల్లో పొలిటికల్ కన్సల్టెంట్ల హవా మొదలైంది. జనం చేతుల్లోకి మొబైల్ ఫోన్లు, డేటా అందుబాటులోకి వస్తున్న దశలోనే సోషల్ మీడియాలో ముసుగు ముఖాలతో ఖాతాలు మొదలయ్యాయి. ఊరు,పేరు ఖాతాల నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం, అబద్దాల దాడి చేయడం 2014కు ముందే మొదలైంది. క్రమంగా అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగం అయ్యాయి. సాంప్రదాయక మీడియా కంటే వేగంగా అబద్దాల ప్రచారం జనంలోకి వెళ్లడం మొదలైంది.పత్రికలు, టీవీల కంటే సోషల్ మీడియాను వాడుకుని జనం మెదళ్లను ట్యూన్ చేయడానికి కన్సల్టెంట్లు ప్రాధాన్యత ఇచ్చాయి. ఏదో ఒక ఇష్యూను పెద్దది చేయడం, సమాజంలో అశాంత, అభద్రత, అనుమానాలు పెంచేలా విషబీజాలు నాటడం, జరగని విషయాలు జరిగిపోతున్నట్టు భ్రమ కల్పించడం, నేరాలు, అత్యాచారాలకు విస్తృత ప్రచారం కల్పించడం, అధికార పార్టీల అసమర్థతను విస్తృతంగా ప్రచారం చేయడం, నకిలీ ఖాతాలో అబద్దాలను సర్క్యూలేట్ చేయడం సోషల్ మీడియా రాకతో సులువైపోయింది.సోషల్ మీడియా మార్కెటింగ్, అందులో లాభాలు, ప్రజలు ప్రభావితం అవుతున్న తీరును గణాంకాలతో వివరిస్తుండటంతో 2019నాటికి అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా బాట పట్టాయి. ఈ క్రమంలో ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి రాజకీయ నాయకుల కుటుంబాల్లో మహిళల్ని టార్గెట్ చేసుకోవడం మొదలైంది. వ్యక్తిత్వ హననం, అక్రమ సంబంధాలను అంటగట్టడం, బురద చల్లడం ద్వారా రాజకీయ ప్రత్యర్థుల్ని మానసికంగా కుంగదీయొచ్చని ట్రోలింగ్ మూకలు భావించాయి.ఫలితంగా అన్ని ప్రధాన పార్టీల నాయకులు సోషల్ మీడియా బాధితులు అయ్యారు. వైసీపీలో జగన్ చెల్లెలు షర్మిల, భార్య భారతి ప్రధాన బాధితులైతే, టీడీపీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఇతర మహిళా నాయకురాళ్లు ఈ విష ప్రచారాలకు బలయ్యారు.జనసేనలో పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా ఆయన సోదరుడు చిరంజీవి కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ కుమార్తెలు, నాగబాబు కుమార్తెను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థి ముఠాలు విష ప్రచారం చేశాయి. ఈ రాజకీయ వ్యవహారాల్లో వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహిళలకు ఎలాంటి సంబంధం లేకపోయినా వారినే లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగించాయితమ కుటుంబంలోని మహిళల్ని ప్రత్యర్థి పార్టీల అభిమానులు ట్రోల్ చేస్తుంటే వారి కుటుంబంలోని మహిళల్ని తమ వాళ్లు ట్రోల్ చేస్తున్నారనే భావనలో ఏపీ పొలిటికల్ పార్టీలు ఉండిపోయాయి. పొరుగున ఉన్న తెలంగాణలో సైతం ఇలాంటి రాజకీయాలు కనిపించవు. అక్కడ సోషల్ మీడియా ట్రోలింగ్‌లో కేవలం రాజకీయ ప్రత్యర్థుల్ని మాత్రమే చేసుకుని సాగేవి. ఒకరిద్దరు కీలక నాయకులపై వ్యక్తిగత విమర్శలు వచ్చినా వారి కుటుంబ సభ్యుల జోలికి ప్రత్యర్థులు వెళ్లిన సందర్భాలు తక్కువ. ఏపీలో మాత్రం వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ రాజకీయాల కోసం మహిళల్ని కించపరచడాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించాయి.సోషల్ మీడియాలో దుష్ప్రచారంలో మహిళలపై జరుగుతున్న దాడుల్ని ఖండించడానికి ఏ రాజకీయ పార్టీ గతంలో ప్రయత్నం చేయలేదు. రాజకీయ వ్యవహారాలతో సంబంధం లేని మహిళలపై జరుగుతున్న విమర్శల్ని ఖండించడం, అదుపు చేయడం పార్టీలకు సులువే అయినా అలాంటి ప్రకటన కూడా వాటి నుంచి రాలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన తరపున మొదట ఈ తరహా ప్రకటన వచ్చింది. మహిళలు, చిన్నపిల్లల జోలికి పోవద్దని పవన్ కళ్యాణ్ మొదట తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సోషల్ మీడియాలో మహిళల జోలికి వెళ్లొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారుసోషల్ మీడియా దుష్ప్రచారాలపై ఏపీ పోలీసులు చేపట్టిన చర్యలు ఎంత మేరకు సత్ఫలితాలనిస్తాయనేది అసలు ప్రశ్న. ఏపీలో వైసీపీ సోషల్ మీడియా బృందాలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సతీమణి భారతిని కించపరిచేలా పోస్టుల్ని వైరల్ చేస్తున్నారు. జనసేన, టీడీపీ అభిమానులు, సోషల్ మీడియా శ్రేణులు ఈ తరహా పోస్టులు పెడుతున్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండటంతో తమ వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని, తాము వచ్చినపసుడు బదులు తీర్చుకుంటామని వైసీపీ చెబుతోంది. సమస్యకు మూల కారణం, దాని పరిష్కారం గురించి ఇప్పటికీ రాజకీయ పార్టీలలో చిత్తశుద్ధి కనిపించడం లేదు. వైసీపీ క్యాడర్‌ను నియంత్రించేందుకు పోలీస్ కేసులు ఉపకరిస్తాయేమో కానీ దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేయలేకపోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తల్ని నియంత్రణలో ఉంచేలా చేయడమే దీనికి ప్రస్తుతం ఉన్న పరిష్కారంగా కనిపిస్తుంది. అదే సమయంలో పొలిటికల్ కన్సల్టెన్సీలు కూడా ఈ విష ప్రచార వ్యాపారంలో మహిళల్ని టార్గెట్ చేయకుండా చూడాల్సి ఉంది.తమ కుటుంబంలోని మహిళల్ని ప్రత్యర్థి పార్టీల అభిమానులు ట్రోల్ చేస్తుంటే వారి కుటుంబంలోని మహిళల్ని తమ వాళ్లు ట్రోల్ చేస్తున్నారనే భావనలో ఏపీ పొలిటికల్ పార్టీలు ఉండిపోయాయి. పొరుగున ఉన్న తెలంగాణలో సైతం ఇలాంటి రాజకీయాలు కనిపించవు. అక్కడ సోషల్ మీడియా ట్రోలింగ్‌లో కేవలం రాజకీయ ప్రత్యర్థుల్ని మాత్రమే చేసుకుని సాగేవి. ఒకరిద్దరు కీలక నాయకులపై వ్యక్తిగత విమర్శలు వచ్చినా వారి కుటుంబ సభ్యుల జోలికి ప్రత్యర్థులు వెళ్లిన సందర్భాలు తక్కువ. ఏపీలో మాత్రం వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ రాజకీయాల కోసం మహిళల్ని కించపరచడాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించాయి.సోషల్ మీడియా దుష్ప్రచారాలపై ఏపీ పోలీసులు చేపట్టిన చర్యలు ఎంత మేరకు సత్ఫలితాలనిస్తాయనేది అసలు ప్రశ్న. ఏపీలో వైసీపీ సోషల్ మీడియా బృందాలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సతీమణి భారతిని కించపరిచేలా పోస్టుల్ని వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా కాంపెయినింగ్ విషయంలో పోలీసు దర్యాప్తు జరుగుతున్న తీరు కూడా సందేహాలకు తావిస్తోంది. ఈ ప్రచారాల పుట్టినిళ్లను కనిపెట్టాల్సిన బాధ్యత వారిపై ఉంది.జనసేన, టీడీపీ అభిమానులు, సోషల్ మీడియా శ్రేణులు ఈ తరహా పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండటంతో తమ వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని, తాము వచ్చినపసుడు బదులు తీర్చుకుంటామని వైసీపీ చెబుతోంది. సమస్యకు మూల కారణం, దాని పరిష్కారం గురించి ఇప్పటికీ రాజకీయ పార్టీలలో చిత్తశుద్ధి కనిపించడం లేదు. వైసీపీ క్యాడర్‌ను నియంత్రించేందుకు పోలీస్ కేసులు ఉపకరిస్తాయేమో కానీ దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేయలేకపోవచ్చు.అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తల్ని నియంత్రణలో ఉంచేలా చేయడమే దీనికి ప్రస్తుతం ఉన్న పరిష్కారంగా కనిపిస్తుంది. అదే సమయంలో పొలిటికల్ కన్సల్టెన్సీలు కూడా ఈ విష ప్రచార వ్యాపారంలో మహిళల్ని టార్గెట్ చేయకుండా చూడాల్సి ఉంది.