సిరాన్యూస్,బేల
దేవి మండపాలకు మంచినూనె డబ్బాలు అందజేత: యువ నాయకులు గట్లేవార్ రవి
ఆదిలాబాద్ జిల్లా బేల స్థానిక మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ తో పాటు ఇందిరానగర్ కాలనీలో నాలుగు శారదా దేవి మండపాల్లో మహా ప్రసాదం అన్నదాన కార్యక్రమాల కోసం గురువారం యువ నాయకులు గట్లేవార్ రవి అందజేశారు. ఒక్కొక్క మండపానికి ఒక్కొక్కటి చొప్పున మంచి నూనె డబ్బాలను మండపాల సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఉప్పల్ వార్ కుండలిక్, మహబూబ్ ఖాన్, ఎండి సాదిక్, గేడం దేవిదాస్, రూపేష్ నిపుంగే, రోహిత్, హరీష్, కె. సాయి, లక్ష్మన్న, తదితరులు ఉన్నారు.