పేదల్లో గుండెల్లో గూడు కట్టిన వైయస్సార్

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు
సిరా న్యూస్,కమాన్ పూర్;
పేదల గుండెల్లో గూడు కట్టుకున్న వైయస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలు మరువరని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షుడు వైనాల్ రాజు అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైనాల రాజు భాస్కర రావులు మాట్లాడుతూ పేదల కొరకు 108 వాహనం ఇందిరమ్మ గృహాలు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు తెలిసినా మనసున్న మారాజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు.
విద్యా వైద్యం వ్యవసాయమే ప్రధాన లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులెత్తించిన కాంగ్రెస్ పార్టీ మహా నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికి మరువరని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు కమాన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం శ్రీనివాస్ భూస తిరుపతి యాదవ్ మాజీ ఎంపీటీసీ బొల్లంపల్లి తిరుపతి గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మద్దూరి ఓదేలు అనవే నా సది కొంతం నిరంజన్ దాసరిపల్లి రాజేష్ తూముల కనకయ్య కోలా తిరుపతి బొజ్జ సతీష్ గడ్డం మదనయ్య కటిక రెడ్డి తిరుపతి అబెంగుల ఐలయ్య కుమ్మరి అనిల్ కుమ్మరి రాజు మైనార్టీ నాయకులు నజీబ్ హైమద్ మనోహర్ నాయకులు చెప్పకుర్తి కనకయ్య కొలిపాక రాజన్న మరియు పెద్ద సంఖ్యలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *