సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ప్రజలకు ఉన్న సందేహాలను తీర్చారు. 6 గ్యారంటీ హామీల్లో భాగంగా రెండు గ్యారెంటీలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటి నుండి ప్రజా పాలన పేరుతో ప్రజల వద్ద నుండి మిగతా గ్యారేజీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ఫారాలను ఎలా నింపాలో స్పెషల్ ఆఫీసర్ ప్రజలకు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ… రేషన్ కార్డు లేని నిరుపేదలు తెల్ల కాగితంపై దరఖాస్తులు అందుకోవాలని, నేటి నుండి ఆరో తేదీ వరకు ప్రతి గ్రామపంచాయతీలో కార్యదర్శి అందుబాటులో ఉంటూ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం వరి నాట్లు నడుస్తున్న సందర్భంగా దరఖాస్తులు అందించని వారికి మండల కార్యాలయంలో స్పెషల్ కౌంటర్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా స్పెషల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, జెడ్పిటిసి మినపాల స్వరూప, సర్పంచ్ స్వప్న, పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు