సిరా న్యూస్, చిగురుమామిడి
8నెలల బాలుడికి అరుదైన వ్యాధి.. వైద్యానికి రూ. 8లక్షల ఖర్చు
* కుమారుడు కోసం అప్పులు చేసి వైద్యం...
* సాయం కోసం పైడిపల్లి వెంకటమల్లు- మమత వేడుకోలు
* ఫోన్ పే,గూగుల్ పే 6309528775…
ఇదిగో ఇక్కడ ఆ తల్లి చేతిలో కూర్చుని ఉన్న చిన్నారిని చూశారా… చిన్నారి పేరు రిషి పుట్టి ఏడాది కూడా పూర్తి కాలేదు.చూడగానే ముద్దులొలికించే ఈ చిన్నోడిని ఓ వ్యాధి కాటేసింది.ఏడాది పూర్తి చేసుకుంటున్న సమయంలో చాలా చలాకీగా కనిపించాల్సిన కుమారుడు…తన శరీరంలోని ఒక్కో అవయవం క్రమంగా పనిచేయడం ఆపేశాయి. దీంతో ఆ తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు… ఏడాది కూడా నిండని ఆ పసిబాలుడిని చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టని రోజంటూ లేదు…
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ములకనూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి వెంకటమల్లు మమత దంపతులకు ఇద్దరు సంతానం.కూతురు రిత్విక(5), కుమారుడు రిషి 8నెలలు ఉన్నారు.అంత సంతోషంగా ఉంటున్న తరుణంలో రిషిని ఓ అరుదైన జబ్బు పట్టుకుంది.వారి సంతోషం ఎంతకాలం నిలువలేదు.రిషి అంబాడలేడు,కూర్చోలేడు, కదలలేడు, టాయ్‌లెట్‌కు వెళ్లలేడని ఆ తల్లిదండ్రులు ఆవేదనతో చెబుతున్నారు.సొంతంగా తన మెడను ఎలాంటి సపోర్టు లేకుండా సరిగ్గా ఉంచలేడు. ప్రస్తుతం ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఆ బిడ్డ సొంతంగా చేయలేడని చెబుతూ ఆ తల్లిదండ్రులు కన్నింటి పర్యంతమవుతున్నారు. కేవలం కంటి చూపు, స్పర్శ మాత్రమే రిషికి ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ శరీరంలో ఒక్కో అవయవం పనిచేయడం మానేస్తుండటంతో ఆ చిన్నారి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది 2024 ఫిబ్రవరి 2న రిషి జన్మించాడు. బాబు పుట్టగానే ఎంతో సంతోషపడ్డామని తల్లిదండ్రులు పైడిపల్లి వెంకటమల్లు మమతలు చెప్పారు. తన ఇద్దరు పిల్లలు సందడి చేస్తుంటే చలాకీగా నవ్వేవారమని ఇప్పుడు ఆ నవ్వులు కరువయ్యాయని నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెబుతూ చాలా ఆవేదన చెందారు.తొలి నాలుగు నెలల్లో రిషి ఆరోగ్యం బాగా ఉందని ప్రతి చర్యకు స్పందించే వాడని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.అయితే తన శరీరంలో ఏదో మార్పులు జరుగుతున్నాయన్న విషయాన్ని గ్రహించలేకపోయామని చెప్పారు. ఇక 2024 మే లో ఒక్కసారిగా శరీరంలో పలు మార్పులు కనిపించడంతో ఆందోళనకు గురైనట్లు చెప్పారు.పాలు త్రాగించిన, నీళ్లు తాగించిన బాలుడు చాలా ఇబ్బంది పడేవాడని చెప్పుకొచ్చారు.కొన్ని నెలలు నుండే బాలుడు మెడ కూడా సరిగ్గా పెట్టలేకపోతుండటం గమనించినట్లు వెంకటమల్లు మమత దంపతులు చెప్పారు. ఆహారం తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడని గుర్తు చేసుకున్నారు.కొన్ని సందర్భాల్లో నీళ్లు కూడా తాగేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.వెంటనే చిన్నపిల్లల డాక్టర్‌ను కలవడంతో ఆమె ఎంఆర్‌ఐ తీయించమని చెప్పారని వెల్లడించారు. ఆ తర్వాత స్కాన్ రిపోర్టు తీసుకుని పెద్ద హాస్పిటల్‌కు వెళ్లమని చెప్పినట్లు చెప్పారు.అయితే అక్కడ డయాగ్నసిస్ చేసిన తర్వాత తమ కుమారుడు ఇంత పెద్ద వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకుని కుప్పకూలారు తల్లిదండ్రులు.శరీరంలోని అవయవాలు పనిచేసేందుకు కావాల్సిన ప్రోటీన్ వ్యవస్థ ధ్వంసమైందని వైద్యులు చెప్పారు.ఇక ఆ చిన్నారి అనుభవిస్తున్న నొప్పి మాత్రం తాను ఏడ్చినప్పుడే తమకు అర్థమవుతోందని తల్లిదండ్రులు చెప్పారు.అయితే చిన్నారి శరీరంలో ధ్వంసమైన ప్రోటీన్‌ను రీప్లేస్ చేసేందుకు ఓ అద్భుతమైన మెడిసిన వచ్చిందని,అయితే అది చాలా ఖరీదుగల మెడిసిన్ వైద్యులు సూచించినట్లు తెలిపారు.చిన్నారి తిరిగి ఊపరి తీసుకునేలా చేయగలదు, తినగలిగేలా చేయగలదు.తన గుండె కూడా సరిగ్గా కొట్టుకోగలదు.అయితే ఈ అద్భుతం జరిగి చిన్నారి తిరిగి నవ్వుతూ రావాలంటే… ఆ అద్భుతం మీరే కావాలి. అవును మీరిచ్చే విరాళాలతో మాత్రమే చిన్నారి ప్రాణాలను నిలపగలం. రోజులు గడుస్తున్న కొద్దీ బాలుడి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఒక ప్రాణం నిలిపేందుకు డబ్బు పెద్ద సమస్య కాదు.రిషి ప్రాణాలను నిలుపుదాం.మీరు విరాళంగా ఇచ్చే ప్రతి వంద రూపాయలు తమ కుమారుడి ప్రాణం నిలిపేందుకు దగ్గరగా చేరుస్తుందని తల్లిదండ్రులు దీనంగా చేతులు జోడించి అడుగుతున్నారు. విరాళం అందజేసే వారు ఫోన్ పే,గూగుల్ పే 6309528775 చెయ్యాలని వేడుకుంటున్నారు.