– మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ వెల్లడి
సిరా న్యూస్,పిడుగురాళ్ల;
పిడుగురాళ్ల పట్టణం నందు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మంగళవారం పట్టణం లో ఆధార్ నమోదు కేంద్రాలు నిర్వహించడం జరిగింది జరిగిందని మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ యెక్క ఆధార్ నమోదు కేంద్రాలు పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలోని
25,27 వార్డ్, సచివాలయం 14 చెరువుకట్ట బజార్ నందు ఏర్పాటు చెయటం జరిగినది అని తెలిపారు. ఈనెల 23,24,25 తేదీలలో మూడు రోజులు పాటు 22 వార్డ్ గాంధీ నగర్ సచివాలయం,14 వార్డ్ పిడబ్ల్యుడి కాలనీ నందు కూడా ఏర్పాటు చేయటం జరిగింది మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కావున పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ ఎన్ ఎం సి ఇర్షాద్, 14వ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ దాసరి అశోక్ కుమార్ పాల్గొన్నారు.