సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మూడు ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోని స్విఫ్ట్ డిజైర్ కార్ ఢీకొట్టింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవరికి ఏం ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకునన్ఆరు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు బ్రీత్ అనలైజర్ తో టెస్టులు నిర్వహించారు.