సిరా న్యూస్,మహేశ్వరం;
మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల్ గట్టుపల్లి లోని ప్రసిద్ధిగాంచిన వీరాంజనేయ స్వామి ఆలయంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ కలిసి స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంతో మహిమ గలిగిన ఆలయ ప్రాంగణంలో ఒక అన్యమతస్తుడు మేకను బలిచ్చి ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రక్షాళనలో భాగంగా ఈరోజు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. నియోజకవర్గంలో హిందువులకు ఇంత అన్యాయం జరుగుతున్న కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీల నాయకులు ఇప్పటివరకు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని, హిందువులంతా వారిని గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పాపయ్య గౌడ్
జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్ రెడ్డి , పార్లమెంట్ కో కన్వీనర్ అనంతయ్య గౌడ్ , అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి ,విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, వివిధ క్షేత్ర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు