సిరాన్యూస్, సామర్లకోట
సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు: తహసీల్దార్ కె. చంద్ర శేఖర్ రెడ్డి
సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ కె. చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం సామర్లకోట మండలం ఉండూరు గ్రామములో ఉండూరు-1 గ్రామ సభ ను నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామ సభ ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.00 గంటల వరకు కొనసాగింది.ఈ గ్రామ సభలో భూయజమానులు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు పాల్గొని రీసర్వే అనంతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తహశీల్దార్ ఆ సమస్యలపై వివరంగా చర్చించి పరిష్కారాలను సూచించారు. సమావేశంలో రీసర్వే డిప్యూటీ తహశీల్దార్ వై. శ్రీనివాస్, మండల సర్వేయర్ పి. సీతారామాచార్యులు, గ్రామ సర్వేయర్లు – సి హెచ్. నర్సింహమూర్తి, ఏ.సంజీవ్ భరత్, టి.సాయిరాం గ్రామ రెవిన్యూ అధికారులు కె. చంద్రబాబు, ఆర్. కొండలరావు పాల్గొన్నారు.