శ్రీవినాయక ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి

సిఎంఆర్ఎఫ్ బిల్లులు ఇస్తామని చెప్పి మోసం చేశారు
విలేకర్ల సమావేశంలో బాధితులు
సిరా న్యూస్,ఖమ్మం :
సిఎంఆర్ఎఫ్ బిల్లులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు బాల నాగమణి, బాల నాగన్న డిమాండ్ చేశారు.ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ కు చెందిన బాల నాగమణి పురుగుల మందు తాగి గత నెల 9వ తేదిన శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరడం జరిగిందని , ఆస్పత్రిలో చేరే ముందు సిఎంఆర్ఎఫ్ బిల్లులు ఇస్తామని చెప్పి ఆస్పత్రిలో ఆడ్మిట్ చేయించుకున్నారని 5రోజుల పాటు చికిత్సచేసి 2లక్షల 50 వేల బిల్లు వేశారని పేషంట్ కండీషన్ సీరియస్ గా ఉందని తక్షణమే హైద్రాబాద్ కు తరలించాలని యాజమాన్యం ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిపారు. చికిత్స సక్రమంగా చేయకుండా కాలయాపన చేసి 2 లక్షల50వేలు బిల్లు వేశారని దానికి సంబంధించిన సిఎంఆర్ఎఫ్ బిల్లులు ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా తమ ఆస్పత్రి బ్లాక్ లిస్టులో ఉందని బిల్లులు ఇవ్వడం కుదరదని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్మిషన్ తీసుకునే ముందు బిల్లులు ఇస్తామని చెప్పి డిశ్చార్జ్ అయ్యే ముందు బిల్లులు ఇవ్వడం కుదరదని మోసం చేశారని బాధితులు ఆవేదన వెల్లిబుచ్చారు. దీనిపై ఆస్పత్రి నిర్వహకులను ప్రశ్నించిన క్రమంలో తమపైనే పోలీసులకు ఫిర్యాదు. చేస్తామని బెదిరిస్తూ ఆస్పత్రి సిబ్బంది చేత దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. పెషెంట్ కు అర్జంటుగా బయటకి తీసుకుపోవాలని లేకపోతే బయటకు గెంటివేయడం జరుగుతుందని మీకు దిక్కున్నచోట చెప్పుకోమంటూ తమపై తమ బంధువులపై దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం ఆస్పత్రి నిర్వహకుల నిర్లక్ష్య ఫలితంగా పెషెంట్ అపస్మారక స్థితిలోకి వెళ్లిందని హైద్రాబాద్ తరలించి అక్కడ మెరుగైన వైద్యాన్ని పొందామని వారు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల దౌర్జన్యానికి పాల్పడుతూ బ్లాక్ లిస్టులో ఉన్న ఆస్పత్రి అంశాన్ని పెషెంట్ బంధువులకు తెలుపకుండా అడ్మిట్ అయి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో సిఎంఆర్ఎఫ్ బిల్లులు ఇవ్వకుండా మోసం చేశారని అటువంటి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ అనంతరం బాధితులు డియం అండ్ హెచ్ ఓ డాక్టర్ కళావతి బాయి కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *