-హారతులతో ఘన స్వాగతం పలికిన భక్తులు
-రామ యంత్రాన్ని దర్శించుకున్న మంథని ప్రజలు
సిరా న్యూస్,మంథని;
అయోధ్యలో ప్రతిష్టించబోయె రామయంత్ర రథయాత్ర మంగళవారం రాత్రి మంథని పట్టణానికి చేరుకోగా భక్తులు హారతులతో ఘన స్వాగతం పలికారు.జగద్గురువు కంచి కామకోటి పీఠాధిపతుల ఆజ్ఞ మేరకు కంచి నుంచి అయోధ్య వరకు రామయంత్ర రథయాత్ర కొనసాగుతుండగా మార్గమధ్యలో మంథనికి చేరుకుంది. సుమారు150 కిలోల పంచ లోహాలు, బంగారు పూతతో చేసిన ఈ శ్రీరామ యంత్రాన్ని కొన్నేళ్ల నుంచి కాంచీపురం లోని కంచి పీఠంలో పూజలు చేశారు. దీనిని అయోధ్యలోని మొదటి అంతస్తులో సీతారామ చంద్ర ఆంజనేయ సమేత విగ్రహ ప్రతిష్ట లో ఈ యంత్రాన్ని ఉంచనుండడంతో ప్రజలు భారీగా తరలివచ్చి యంత్రాన్ని దర్శించుకున్నారు. ఈ రామాయంత్ర రథన్ని మంథని పురవీధుల గుండా ఊరేగించారు. మంగళవారం రాత్రి మంథని పట్టణంలోని బ్రాహ్మణ సంఘంలో బస చేశారు.తిరిగి బుధవారం ఉదయం కరీంనగర్ కు బయలుదేరారు. కరీంనగర్, నిజామాబాద్, మహారాష్ట్ర మీదుగా అయోధ్య చేరుకోనుంది. పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొని శోభయాత్ర ద్వారా ఈ రథాన్ని సాగనంపారు. ఈ కార్యక్రమంలో రథయాత్ర మంథని కోఆర్డినేటర్ బొబ్బిలి శ్రీధర్, విశ్వహిందూ పరిషత్ మంథని అధ్యక్షుడు కోత్త శ్రీనివాస్, గర్రెపల్లి వెంకన్న కౌన్సిలర్ వికే రవి, రాపర్తి సంతోష్, బోగోజు శ్రీనివాస్, రేపాల ఉమాదేవి తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.