సిరాన్యూస్, ఓదెల
మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేత : ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం ముదిరాజ్
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ ఆర్ జి 3 జిఎం ఆఫీస్ ఆవరణలో గల ఎకో పార్క్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబును మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబుకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కారుల సమస్యలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి కదార కళాధర్ రెడ్డి , పెద్దపల్లి జిల్లా పార్లమెంట్ కన్వీనర్ బత్తుల శంకర్, మండల నాయకులు సిహెచ్ ప్రతాపరెడ్డి , తదితర నాయకులు పాల్గొన్నారు.