సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ మంగళవారం ఈడీ ముందు హజరయ్యారు. గతంలో ఉప్పల్ పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన చేసిన విషయం తెలిసిందే. 2020 – 2023 మధ్యలో హెచ్సీఏ లో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు అందాయి. 3.8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలు లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇదే వ్యవహారంలో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ పొందాడు. ఈటీ 0తాజాగా అజారుద్దీన్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో అయన మంగళవారం విచారణ కు హాజరు అయ్యారు. తనపై కావాలనే తప్పుడు అభియోగాలు మోపారు ఇవన్నీ ఫాల్స్ కేసులు అని ఆజార్ అన్నారు.