సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం లో విత్తన శనిగలు పంపిణీ చేయడానికి అగ్రికల్చర్ కార్యాలయానికి రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వచ్చారు. శనిగలు పంపిణీ చేయడానికి మంత్రి బీసీ రాకతో అక్కడ రైతులు ఎవరు లేకపోవడంతో నేను ఎవరికి పంపిణి చేయాల అని అగ్రికల్చర్ ఏఓ సుబ్బారెడ్డి పై అసహనం వ్యక్తం చేసారు. రైతులను ఆహ్వానించకుండా తూతూ మంత్రంగా సభ ఏర్పాటు చేయడంపై అధికారులపై సీరియస్ అయ్యారు.
విత్తన పంపిణీ చేయడానికి వచ్చి న మంత్రి రాకతో రైతులు ఎవరు లేకపోవడంతో శనిగల ప్యాకెట్లు పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు. అగ్రికల్చర్ కార్యాలయం పక్కన ఖాళీ స్థలంలో ఓ బంకు దర్శనం ఇవ్వడంతో మంత్రి కంగుతున్నారు.అగ్రికల్చర్ కార్యాలయం ముందర బంకు ఎవరు వేసుకోమన్నారు అక్కడ చెత్త చెదారము ఏంటి అని ఏవో సుబ్బారెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అగ్రికల్చర్ కార్యాలయంలో అపరిశుభ్రతను చూసి అసహన వ్యక్తం చేసారు.