BRS town president Ajay:ప్రోటోకాల్ ఉల్లంఘన పై క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేస్తాం: బీఆర్ఎస్‌ పట్టణ అధ్యక్షులు అజయ్

సిరా న్యూస్‌,ఆదిలాబాద్‌
ప్రోటోకాల్ ఉల్లంఘన పై క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేస్తాం: బీఆర్ఎస్‌ పట్టణ అధ్యక్షులు అజయ్
* మేము తలుచుకుంటే కొబ్బరికాయలు కొట్టకుండా చేస్తాం 

అధికార దాహంతో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ లు తో పాటు మున్సిపల్ అధికారులు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ లేకున్నప్పటికి అధికార కార్యక్రమాలు నిర్వహించడం ,కొబ్బరికాయలు కొట్టి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడటం జరుగుతుందని బీఆర్ఎస్‌ పట్టణ అధ్యక్షులు అజయ్ తీవ్రంగా ఖండించారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్‌ జిల్లా కార్యాలయంలో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ బీజేపీ నాయకుల వైఖరిని ఎండగట్టారు . ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి గత బి ఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 322 కోట్ల నిధులను మాజీ మంత్రి జోగు రామన్న కృషితో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి మంజూరు చేసుకోగా స్థానిక ఎమ్మెల్యే పాలయ శంకర్ , ఎంపీ నగేష్ హడావిడిగా అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టడం హాస్యస్పదంగా ఉందన్నారు. అభివృద్ధి పేరుతో బిజెపి నాయకులు హడావిడి చేస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. చట్టరీత్య వీరిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పాయల్ శంకర్ కు అనుభవం లేకపోవచ్చు, స్థానిక ఎంపీ నగేష్ మాజీ మంత్రిగా గత ఎమ్మెల్యేగా అనుభవం ఉండి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.స‌మావేశంలో కౌన్సిలర్లు వెనుగంటి ప్రకాష్. దమ్మ పాల్, మోబిన్, సృజన్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *