సిరాన్యూస్, ఓదెల
చైర్మన్ మేకల మల్లేష్ యాదవ్ ను సన్మానించిన పాలకవర్గం
పెద్దపల్లి జిల్లా ఓదెల జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ పదవి పూర్తి కావడంతో పాలకవర్గం చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చొరవతో స్వామి వారి దయవల్ల దేవస్థానానికి రెండు సంవత్సరాలు చైర్మన్ పదవి నిర్వహించారు. దాసరి మనోహర్ రెడ్డికి పాలకవర్గానికి దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాలకవర్గం మేడ గోని శ్రీకాంత్, రాపర్తి మల్లేశం, డాక్టర్ సతీష్, అరెల్లి మొండయ్య, భక్తుల రమేష్ బాబు , ఆలయ సిబ్బంది ముంతసాని కుమారస్వామి, తదితరులు ఉన్నారు.