సిరా న్యూస్,హైదరాబాద్;
జీహెచ్ంఎసి ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కి నగరవాసులు క్యూ కట్టారు. సర్కిల్, జోనల్ ఆఫీస్ లలో పరిష్కారం కానీ తమ సమస్యలకు హెడ్ ఆఫీస్ లో నైనా పరిష్కారం దొరుకుతుందని… ప్రజావాణికి తరలి వచ్చారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బల్దీయా అధికారులు నగరవాసుల నుంచి పిర్యాదులు స్వీకరించారు. గత వారం ప్రజావాణి లో ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడం తో అలర్ట్ అయినఅధికారులు, ఈ సారి ప్రజావాణి కార్యక్రమం కు ఆంక్షలు విధించారు. ప్రజావాణి కార్యక్రమం లో పిర్యాదులు ఇచ్చే వారిని పోలీసులు తనిఖీ చేసి లోపలికి పంపారు. ఫోన్లను కుడా లోపలికి అనుమతించలేదు.