సిరా న్యూస్,భైంసా;
బైంసా మండలంలోని సిరాల గ్రామంలో మంగళవారం దళిత, అగ్ర కులాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భాదితులు తేలిపిన వివరాల ప్రకారం గ్రామంలో దళిత కుటుంబాల మధ్య చిన్న పంచాయతి ఏర్పాటు చేశారు అందులో ఒకరు గ్రామంలోని అగ్ర కులస్తులకు ఫోన చేయగా వారు రావడంతో ఎందుకు మా పంచాయతికి వచ్చారని ఇరువురు గోడవ పడడంతో….. ఆ గోడవ ఒకరినొకరు కోట్టుకోనేవరకు వెళ్ళింది. ఈ గోడవలో దళిత మహిళలకు గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణ చేస్తున్నమని పోలీసులు తెలిపారు.