సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ఓ చేపల చెరువులో గుర్తు తెలియని మహిళా మృతదేహం కలకలం రేపింది. కల్లూరు టౌన్ పరిధిలోని పుల్లయ్య కుంట చెరువులో గుర్తుపట్టని విధంగా పూర్తిగా కుళ్లిపోయిన మహిళా మృతదేహం స్థానికులు గుర్తించారు.దీనితో భయాందోళనతో పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో వున్న మృతదేహాన్ని వెలికి తీయించారు.ఇటీవల మిస్సింగ్ కేసులు పరిశీలించి గుర్తిస్తామని కల్లూరు ఏసిపి రఘు తెలిపారు..