సిరా న్యూస్,యాదాద్రి;
ఈనెల 8 తేదిన సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అయన మూసి పునరుజ్జీవం యాత్ర” పేరుతో మూసి పరివాహక ప్రజల వద్దకు రానున్నారు. ముందుగా అయన కుటుంబసమేతంగా యాదాద్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత వైటీడీఏ (YTDA), జిల్లా అధికారులతో.. ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు సిఎం రేవంత్ మూసి పునరుజ్జీవ ప్రజా చైతన్య పాదయాత్ర ప్రారంభిస్తారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు. మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు సిఎం శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య -సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.