సిరా న్యూస్,యాదాద్రి భువనగిరి;
రామన్నపేట పట్టణ కేంద్రంలో మహిళ సంఘాల సభ్యులు చిట్యాల భువనగిరి రోడ్డుపై బైఠాయించారు. దుబ్బాక గ్రామంలో వివిధ మహిళ సంఘాల నుంచి 70లక్షల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపించారు. సంఘాల నుంచి లోన్ ద్వారా వి.బి.కే లింగస్వామి చేతివాటం చూపించాడు. . నెలనెలా డబ్బులు చెల్లించిన రుణం ఖాతాలో జమా కానీ వైనం బయటపడింది. బ్యాంకు అధికారుల కనుసన్నల్లో జరిగిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. మా డబ్భులు అకౌంట్లలో జమా చేసే వరకు ధర్నా విరమించేది లేదని అన్నారు. అరగంట పాటు ధర్నా జరిగింది. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సర్దిచెప్పారు.