సిరాన్యూస్, ఆదిలాబాద్
వీల్ చైర్ అందజేసిన కలెక్టర్ రాజర్షి షా
*ప్రజావాణి కి 59 దరఖాస్తులు
ప్రజావాణిలో వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి 59 అర్జీలను స్వీకరించడం జరిగిందనీ, ఆయా శాఖల కు సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం నార్నూర్ మండలం జామడ గ్రామం ఆత్రం మారుతి కి వీల్ చైర్ అందించడం జరిగింది.అధికారులతో మాట్లాడుతూ అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా శాఖల కు సంబంధించి పెండింగ్ లో ఉన్న అర్జీల పై సమీక్షించారు.
ప్రజావాణి లో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.