Congress Kandi Srinivasa Reddy:  కేటీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం : కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి

సిరాన్యూస్,ఆదిలాబాద్‌
 కేటీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం : కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి
* కాంగ్రెస్ శ్రేణుల నిర‌స‌న‌

ఆదిలాబాద్ వేదిక‌గా సీఎం రేవంత్‌రెడ్డిపై, కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. విమ‌ర్శ‌ల‌ను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి నేతృత్వంలో కేటీఆర్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ప‌ట్ట‌ణంలోని ప్ర‌జాసేవా భ‌వ‌న్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద జ‌రిగిన నిర‌స‌న కార్యక్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. త‌మ ప్రియ‌తమ నేత, సీఎం రేవంత్‌రెడ్డిని ప‌ట్టుకుని పరుష పదజాలంతో దూషించిడ‌మే కాకుండా దురహంకారంగా మాట్లాడ‌డం సిగ్గుచేట‌ని కంది శ్రీ‌నివాస‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. కార్యక్రమం లో డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ దిగంబ‌ర్ రావు పాటిల్, స‌యీద్ ఖాన్ , జైన‌థ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ అల్లూరి అశోక్ రెడ్డి ,ప‌ట్ట‌ణ కాంగ్రెస్ అధ్య‌క్షులు గుడిప‌ల్లి న‌గేష్ , గిమ్మ సంతోష్ రావు,లోక ప్రవీణ్ రెడ్డి,ఎం.ఏ షకీల్,మావల ఎంపీపీ దర్శనాల సంగీత – ఏవన్,ఐ.ఎన్.టి.యూ.సి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్,బండారి సతీష్, ఆవుల వెంకన్న, ద‌ర్శ‌నాల ల‌క్ష్మ‌న్, భూమ‌న్న‌, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *