సిరాన్యూస్, బేల
తిరిన గ్రామస్తుల రేషన్ కష్టాలు.. ఫలించిన సామ రూపేష్ రెడ్డి కృషి
ఎన్నో ఏళ్లుగా సుమరు 5 కిలో మీటర్ల దూరం నుంచి రేషన్ తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడిన అదిలాబాద్ జిల్లా బేల మండలం లోని దుబ్బగుడ,సాస్ తాండ,టెమ్రి గూడ గ్రామస్తుల రేషన్ కష్టాలు ఎట్టకేలకు తిరాయి.ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి కృషితో ఆదివాసి గుడాల ప్రజల రేషన్ కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఆదివాసి అమాయక ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడమే తన కర్తవ్యంగా భావించి సైద్ పూర్ గ్రామంలో ఉన్న రేషన్ షాప్ ద్వారా దుబ్బగూడ లో సబ్ సెంటర్ ఏర్పాటు చేయించారు.అయితే దీన్ని అధికారుల సహాయంతో ఏర్పాటు చేయించి గ్రామస్తుల కష్టాలు తీర్చిన సామ రూపేష్ రెడ్డిని పలువురు అభినందించగా గ్రామస్తులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.అంతకు ముందు రేషన్ షాప్ ను ఏర్పాటు చేయగా దానిని ప్రారంభించి రేషన్ డీలర్ అరవింద్ తో కలిసి ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు.రేషన్ షాపు ఏర్పాటు కోసం అడిగిన వెంటనే రేషన్ షాప్ సబ్ సెంటర్ ను మంజూరు చేసిన అధికారులకు సామ రూపేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.