సిరా న్యూస్,కూకట్ పల్లి;
కె.పి.హెచ్.బి కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇప్పిస్తానని మోసానికి పాల్పడిన వేణుగోపాల్ దాస్ అనే వ్యక్తి పై కేసు నమోదయింది. నిందితుడు ఒక్కొక్కరి దగ్గర లక్షా 70 వేల రూపాయల నుండి 2.5 లక్షల రూపాయలు వసూలు చేసాడు. తరువాత బాధితులకు డబుల్ డబుల్ బెడ్ రూం అలాట్మెంట్ లెటర్, ఇంటి తాళాలు ఇచ్చాడు. ఇళ్ళలోకి వెళ్లేందుకు యత్నించిన వారికి, ఆ ఇంటిలో నివాసం ఉన్నవారిని చూసి మోసపోయినట్లు గుర్తించారు. పదిహేను మంది బాధితులు కె.పి.హెచ్.బి పోలీసులను ఆశ్రయించారు. ..