సిరాన్యూస్, ఓదెల
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి : డీపీఎం తిరుపతి
* ఓదెలలో శిక్షణ కార్యక్రమం
నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మద్దతు ధరపై పంటను కొనుగోలు చేయాలని డీపీఎం తిరుపతి అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఓదెల, కాల్వ శ్రీరాంపుర్ సెంటర్ల వారికీ నిర్వహించారు. ఈసందర్బంగా డీపీఎం తిరుపతి మాట్లాడుతూ పంటల నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉండాలని, తేమ శాతం 17 లోపు ఉండాలని చెప్పారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2320/- కామన్ గ్రేడ్ రకానికి 2300/- మద్దతు ధర ఉందని అన్నారు. అనంతరం సీసీ రాజయ్యలు శిక్షణ ను ఏపీఎం లకు,సీసీ లకు,కమిటీ మెంబెర్స్ కు,బుక్ కీపర్ లకు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఏపీఎంలు లతామంగేశ్వరి, కనకయ్య, సీసీ లు మారెళ్ళ శ్రీనివాస్, మల్లయ్య, కొమురయ్య, విజయ, శారద, హరికృష్ణ, నిర్మల, తిరుపతీదేవి, కనకతార, భవాని, చంద్రకళ, శ్రీరాంపుర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు మౌనిక, ఓదెల మండల కార్యదర్శి లలిత , కమిటీ మెంబర్లు, బుక్ కీపర్లు పాల్గొన్నారు.