సిరా న్యూస్,పామర్రు;
తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. కృష్ణాజిల్లాలో పలుచోట్ల, రాజమండ్రిలో బైక్ దొంగతనాలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నలుగురు దొంగలు అరెస్ట్ , రూ. 4 లక్షల రూపాయల విలువచేసే 12 బైకులు స్వాధీనం చేసుకున్నారుఏ. దొంగలు మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన పెండ్రు రాజు, కొక్కిలిగడ్డ చరణ్ తేజ, ఉడుముల అశోక్, శ్రీకాకుళం సాయికుమార్ లు. అందరూ ఒకే గ్రామానికి చెందిన దొంగలు కావటం విశేషం. జిల్లాలో తోట్లవల్లూరు చల్లపల్లి, మోపిదేవి గుడ్లవల్లేరు, కృత్తివెన్ను పెదపారుపూడి, గూడూరు, పెనమలూరు రాజమండ్రి ద్విచక్ర వాహనాలు చోరీ చేసారు. ఊరు చివర ప్రాంతాలు, పంట పొలాల వద్ద రైతులు పెట్టిన వాహనాలే వీరి టార్గెట్. చెడు వ్యసనాలకు బానిసలై … తమ వ్యసనాలు తీర్చుకోవడానికి ఈజీ మనకి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడ్డారు. ఓఎల్ఎక్స్ లో పెట్టి అమ్మకాలు చేసారు. దొంగలపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.