సిరా న్యూస్,పామర్రు;
తోట్లవల్లూరు (మ) రొయ్యూరు ఇసుక క్వారీలో ఎడ్ల బండ్లకు చెందిన ఇరువు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు వసి కర్రలతో దాడులు చేసుకున్నాయిజ మోర్ల శివ సాయి, అతని బావమరిది పై జస్వంత్, ఈశ్వర్ లు దాడి చేసారు. శివ సాయికి తలపై తీవ్రగాయాలు అయ్యాయి. బాధిలులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. తలకు తీవ్రగాయాలు కావడంతో శివసాయిని ఆస్పత్రికి పంపించారు. ఐలూరు, కళ్ళం వారి పాలెం, చాగంటిపాడు, భద్రిరాజుపాలెం రాత్రి సమయాల్లో వందలాది ఎడ్లబండ్లతో యదేచ్చగా ఇసుక తోలకాలు జరుగుతున్నాయి. ఎడ్ల బండ్లతో తోలి డంపు చేసి ట్రాక్టర్లకు ఎగుమతి చేస్తారు.