సిరా న్యూస్,కమాన్ పూర్;
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరెట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పోలీస్ శాఖ నిర్వహించిన సర్వేలో బెస్ట్ సిటిజన్ సర్వీసెస్ విభాగంలో రాష్ట్ర మూడో ర్యాంక్ దక్కించుకుంది.పౌరులకు సత్వర సేవలు పరిష్కారానికి మొదలైన చర్యలు తీసుకుంటున్న ఉత్తమ పోలీస్ స్టేషన్ లో ఎంపిక ప్రక్రియను ఇటివలే పోలీస్ శాఖ చేపట్టినది ఇందు కోసం ఆన్లైన్ ద్వారా ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.ప్రజలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా బెస్ట్ సిటిజన్ సర్వీసెస్ విభాగంలో బెల్లంపల్లి వన్ టౌన్ కు మూడో ర్యాంక్ దక్కినది.రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చేలా పౌరులకు సత్వర సేవలు అందించి బాధితుల సమస్యల పరిష్కారాలకు చర్యలు తీసుకున్న టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్యను తన కార్యాలయంలో కలిసి అభినందనలు తెలియజేసి అనంతరం సత్కరించి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్స్ జె ఏ సి రాష్ట అధ్యక్షులు మంద రవి కుమార్, బెల్లంపల్లి త్రిసభ్య కమిటి మరియు ఆటో యూనియన్స్ జె ఏ సి రాష్ట అధికార ప్రతినిధి దార మధు, రాష్ర్ట నాయకులు మరియు బి ఆర్ టి యు రాష్ర్ట కార్యదర్శి నీలారపు రవి, ఆటో యూనియన్స్ జె ఏ సి పెద్దపల్లి జిల్లా ఇంఛార్జీ కాసిపేట రాజయ్య, జిల్లా కన్వీనర్ రేణుకుంట్ల సురేష్, జె ఏ సి కరీంనగర్ జిల్లా నాయకులు మరియు కరీంనగర్ జిల్లా ఆటో సంక్షేమ సంఘం అధ్యక్షులు మద్దెల రాజేందర్, జిల్లా ఆటో సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిలు మటం సాగర్, కొత్తూరి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు వాలుక రమేశ్ లు పాల్గొన్నారు.