సిరాన్యూస్, నిర్మల్
మున్సిపాల్ కార్మికుల వేతనాలు చెల్లించాలి : ఎంఏఎస్ రాష్ట్ర అధ్యక్షులు నికులపు లింగన్న
* నిర్మల్ లో నాల్గొవ రోజుకు చేరిన మున్సిపాల్ కార్మికుల సమ్మె
మున్సిపాల్ కార్మికుల ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని ఎంఏఎస్ రాష్ట్ర అధ్యక్షులు నికులపు లింగన్న అన్నారు.
నిర్మల్ జిల్లాలోని మున్సిపల్ కార్మికులకు గత మూడు నెలల నుండి వేతనాలు చెల్లించలేకపోవడంతో నిరవధిక సమ్మె నిర్వహించారు. మున్సిపాల్ కార్మికుల సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు అంబేద్కర్ మాదిగల సంఘం మద్దతు ప్రకటించింది. ఈసమ్మెకు ఎంఏఎస్ రాష్ట్ర అధ్యక్షులు నికులపు లింగన్న, ఎం హెచ్ పి ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు కత్తి విష్ణు మద్దతు తెలిపారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు చెల్లించడం లేదన్నారు. ఏ పార్టీ కూడ మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు.