మహిళా బస్ కండక్టర్ తో వాగ్ వివాదం
పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
సిరా న్యూస్,మేడ్చల్;
కొయ్యల సరిత అను మహిళ ఈసీఐఎల్ నుండి ఉప్పల్ వెళ్ళు బస్సులో ప్రయాణ నిమిత్తం ఎక్కడం తో బస్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గద్ద శ్రీదేవి టికెట్ కోసం త్తం ఆధార్ కార్డు అడిగింది. సరిత చిరిగివున్న ఫోటోతో సరిగా లేని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆధార్ కార్డు చూపించడంతో కండక్టర్ శ్రీదేవి ఏపీకి సంబంధించిన ఆధార్ కార్డు చెల్లదని మీరు టికెట్ తీసుకొని ప్రయాణం చేయాలనిచెప్పింది. అయినా వినకుండా కండక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, బూతులు తిడుతూ ఆమెపై చేయి చేసుకొని బస్సు దిగి బస్సు ముందర రోడ్డుపై పడుకొని ప్రయాణికులకు, సిబ్బందికి ఆటంకం కలిగింది. దాంతో కండక్టర్ శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మహిళను తరలించే చే సమయంలో దురుసుగా ప్రవర్తిస్తూ మహిళా పోలీసులను కాళ్లతో తన్ని బూతు మాటలు తిట్టింది. పిఎస్ మెయిన్ గేట్ లో గత మూడు రోజులుగా కూర్చొని ధర్నా చేస్తూ ధర్నా చేస్తున్నానని చెబుతూ పోలీస్ సిబ్బందికి విధులు నిర్వహించకుండా ఆటంకం కలిగించింది. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉండడంతో మహిళా పోలీస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు. తీగ లాగితే డొంక కదిలినట్లు, సరిత గతంలో కూడా సరూర్ నగర్ పిఎస్ నందు ఈ విధంగా ప్రవర్తించడంతో అంబర్పేట్ పిఎస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం పోలీస్ స్టేషన్, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లలో వివిధ సెక్షన్ల కింద కేసులో నమోదు ఐనట్లు తెలిసింది. ఈమె ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులను బెదిరిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ వారిని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండడంతో ఆమెపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.