మెగా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రద్దు చేయాలి
కేటీఆర్
సిరా న్యూస్,హైదరాబాద్;
కేసీఆర్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టారు. పాలమూరు,రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలోనే ప్రారంభం అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం నాడు అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
మెగా ఇంజనీరింగ్ కంపెనీని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు. మెగా కంపెనీ మాఫియా లాగా తయారు అయిందనిరేవంత్ రెడ్డి అన్నారు. మెగా మాఫియా అని జగ్గారెడ్డి అన్నారు. మేము ఎన్నడూ ఆ కంపెనీని వ్యక్తిగతంగా దూషించలేదు. సుంకిశాల నుండిహైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకురావడానికి కట్టిన ప్రాజెక్టు ఇన్ టెక్ వెల్ కుంగుబాటుకు గురి అయితే మేము మాట్లాడాం. కాళేశ్వరం పిల్లర్లు కుంగితే మీరు కమిషన్ వేశారు కదా. సుంకిశాల కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని విచారణ కమిటీ చెప్పినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ అని రేవంత్ రెడ్డి పిలిచిన కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ,రాష్ట్ర మంత్రి పొంగులేటి రాఘవ కంపెనీ కలిసి 4,350 కోట్ల టెండర్లను దక్కించుకున్నాయి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను రద్దు చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో పని చేసిన కంపెనీలను తిరస్కరించి మెగా,రాఘవ కంపెనీలకు పనులు ఇచ్చారు. 4,350 కోట్లలో రేవంత్ రెడ్డికి ముట్టిన వాటా ఎంత…? రాహుల్ గాంధీకి ముట్టిన వాటా ఎంత…? కాళేశ్వరం నీళ్లను 5,560 కోట్లతో మూసీకి తీసుకువస్తామని ప్రభుత్వం ఆంటోంది. మేము అధికారంలో వున్నప్పుడు కొండ పోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లను 1100 కోట్లతో గండిపేటకు తేవాలని క్యాబినెట్ నిర్ణయం జరిగిందని అన్నారు.
కాళేశ్వరం నుండి గోదావరి నీళ్లను మూసీకి తీసుకువచ్చే ప్రాజెక్టును మెగా కంపెనీకి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్దం అయ్యారు. మేము అధికారంలోకి వచ్చాక అన్నింటిపై విచారణ చేస్తాము. ఇంజనీర్లు,అధికారులు జాగ్రత్తగా ఉండండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర,ఢిల్లీకి మూటలు పంపారు. అధికారులు చేయకూడని సంతకాలు చేస్తే ఉద్యోగాలు పోతాయి. క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి కుటుంబానికి వర్క్ వస్తుంది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే దానిపై బీజేపీకి సోయి ఉందా . రేవంత్ రెడ్డి సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్కడ వున్నారు. రేవంత్ రెడ్డి బామ్మర్ధికి అమృత్ టెండర్లు కట్టబెట్టారు. బిఆర్ఎస్ వాళ్ళపైనే ఈడీ,ఐటీ రైడ్స్ అవుతాయా…? పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి నోట్ ఇవ్వలేదు. సుంకిశాల విషయంలో మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టె వరకు మేము ఫైట్ చేస్తామమని అన్నారు.
మెగా క్ర29ిష్ణా రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. వాళ్ళు,వీళ్ళు జైలుకు పోతారని పొంగులేటి ఎట్లా చెప్తారు. పొంగులేటి నువ్వు జైలుకు ఎప్పుడు వెళ్తావో తెలుసుకో. ఆర్.ఆర్.ట్యాక్స్ అన్న మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈడీ రైడ్స్ పై పొంగులేటి ఇప్పటి వరకు నోరు విప్పరు. అదానీతో రేవంత్ రెడ్డి అక్రమ సంబందాలు తెలుసు. రిపోర్టులను తారుమారు చేసే అవకాశం ఉంది. కాలేశ్వరం రిపేర్లు ఇప్పటికీ చేయడం లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదానీతో ఒప్పందం చేసుకుని ఈడీ రైడ్స్ పై ఎలాంటి చర్యలు లేకుండా చేసుకున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *