సిరా న్యూస్, సైదాపూర్:
వెన్నంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను బుధవారం ఆర్జెడి కె.సత్యనారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో విద్యార్థులను ప్రశ్నించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ఏ విధంగా అమలవుతుందో స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాల దిశగా అడుగులు ముందుకు వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్.ప్రభాకర్ రెడ్డి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి, వి.ప్రవీణ్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, కుమార్, వీరారెడ్డి, సత్య, జయప్రద, పద్మ, నళిని తదితరులు పాల్గొన్నారు.